ఎపుడైనా నీవు నీ చుట్టూ ఉన్న సృష్టిని చూచి అవి ఎలా ప్రారంభమైనవో ఆశ్చర్యపడితివా? సృష్టిలో అనేకమైన జంతువులు, పక్షులు, చెట్లు, మరియు మొక్కలు భూ మి మీద ఉన్నవి. అవి ఎక్కడ నుంచి వచ్చాయి? అవి ఎల్లప్పుడునూ ఇక్కడ ఉన్నవా? మానవుని గురుంచి ఏమిటి? నీ దేహము ఎలా పనిచేస్తుందో చూడుము. నీ కన్నులు చూచుటకు, నీ చెవులు వినుటకు, నీ పాదాలు చేతులు పని చేయుటకు సహాయపడుతన్నవి, మరియు నీవు వెళ్ళవలసిన చోటునకు వెళ్లుచున్నావు. ఇవన్నీ కేవలము జరుగుచున్నవా, లేదా అవి ఒకరిచేత నిర్మించబడినవా?
30 ఏప్రిల్, 2024 in క్రైస్తవ జీవితం, Color 2 minutes
నాకొక స్నేహితుడు ఉండెను.నాకుండిన స్నేహితులందరిలో ఉత్తమమైన వాడు.అతడు సత్యవంతుడు మరియు చాలా దయ కలిగిన వాడు.కాబట్టి నీవు కూడా అతని గురుంచి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.అతని పేరు యేసు.అధ్బుతమైన విషయం ఏమిటంటే అతడు నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అతనిని గూర్చి నీకు చెబుతాను.మనం ఈ కథ బైబిల్ నందు చదవవచ్చు.బైబిల్ సత్యమైనది.అది దేవుని వాక్యము. ప్రపంచమును మరియు దానిలోని సమస్తమును దేవుడే సృష్టించెను.ఆయన భూలోకమునకు మరియు పరలోకమునకు ప్రభువై యున్నాడు.ఆయన అన్నింటికి ప్రాణమును మరియు ఊపిరిని అనుగ్రహిస్తాడు. యేసు దేవుని కుమారుడు.అతనిని మనందరి స్వంతరక్షకుడుగా ఉండుటకు దేవుడు భూమి మీదకు పంపెను.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను(అంటే నిన్ను మరియు నన్ను ప్రేమించెను )కాగా తన అద్వితీయ కుమారుని (మన కొరకు మరణించుటకు )పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందవలెనని ఆయనను అనుగ్రహించెను.(యోహాను3:16)
15 మార్చి, 2022 in యేసు, ప్రేమ, స్నేహం, ఒంటరితనం, Color 2 minutes