మీ స్నేహితుడైన యేసు
నాకొక స్నేహితుడు ఉండెను.నాకుండిన స్నేహితులందరిలో ఉత్తమమైన వాడు.అతడు సత్యవంతుడు మరియు చాలా దయ కలిగిన వాడు.కాబట్టి నీవు కూడా అతని గురుంచి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.అతని పేరు యేసు.అధ్బుతమైన విషయం ఏమిటంటే అతడు నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను.
అతనిని గూర్చి నీకు చెబుతాను.మనం ఈ కథ బైబిల్ నందు చదవవచ్చు.బైబిల్ సత్యమైనది.అది దేవుని వాక్యము.
ప్రపంచమును మరియు దానిలోని సమస్తమును దేవుడే సృష్టించెను.ఆయన భూలోకమునకు మరియు పరలోకమునకు ప్రభువై యున్నాడు.ఆయన అన్నింటికి ప్రాణమును మరియు ఊపిరిని అనుగ్రహిస్తాడు.
యేసు దేవుని కుమారుడు.అతనిని మనందరి స్వంతరక్షకుడుగా ఉండుటకు దేవుడు భూమి మీదకు పంపెను.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను(అంటే నిన్ను మరియు నన్ను ప్రేమించెను )కాగా తన అద్వితీయ కుమారుని (మన కొరకు మరణించుటకు )పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందవలెనని ఆయనను అనుగ్రహించెను.(యోహాను3:16)
యేసు పసి బాలుడుగా భూమిమీదకు వచ్చెను.భూమి మీద యోసేపు,మరియలు తల్లితండ్రులుగా యుండెను.ఆయన పశువుల పాకలో జన్మించి తొట్టెలో పరుండబెట్టబడెను.
యేసు –యోసేపు ,మరియల ఇంటిలో పెరిగి వారికి లోబడి ఉండెను.అతడు ఆటలాడుకొనుటకు అన్నదమ్ములు,అక్కాచెల్లెల్లుండిరి.యోసేపునకు వడ్రంగి పనిలో సహాయపడుచుండెను.
యేసు పెద్దవాడైన తర్వాత పరలోకమందలి తన తండ్రిని గూర్చి ప్రజలకు భోదించెను.దేవుడు వారిని ఎలా ప్రేమించెనో వారికీ చూపించెను.అతను రోగులను స్వస్థపరచి శ్రమలలో ఉన్నవారిని ఆదరించెను.ఆయన పిల్లలకు స్నేహితుడిగా వారు తన దగ్గరకు రావలేనని వారి కొరకు సమయమును గడుపు చుండెను.
పిల్లలు కూడా యేసుని ప్రేమించి అతనితో ఉండుటకు యిష్టపడుచుండిరి.
కొందరు యేసును ప్రేమించక ద్వేషించి హింసించిరి.వారు యేసుని బహుగా ద్వేషించి చివరికి చంపవలెనని నిశ్చయించుకొనిరి.ఒకానొక దినమున ఆయనను సిలువలో మేకులు గొట్టి చంపిరి.యేసు ఏ నేరము చేయలేదు.నీవు నేను చేసిన అపరాధములకు మన స్థానములో ఆయన మరణించ వలసి వచ్చెను.
యేసు క్రీస్తు కథ అతని మరణముతో ఆగిపోలేదు.దేవుడు అతనిని మృతులలో నొంది లేపెను.అతని శిష్యులు అతనిని చూసిరి.తర్వాత ఒక రోజు తిరిగి పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళిపోయెను.
ఈ రోజు నిన్ను చూడగలడు నీ మాట వినగలడు.నిన్ను గూర్చి సమస్తము ను ఎరిగిన వాడై నీ యెడల అక్కరకలిగి యున్నాడు.మీరు ప్రార్ధన ద్వార అతని దగ్గరకు రండి.మీ బాధలన్నింటి గూర్చి అతనికి బాధలన్నింటిని గూర్చి అతనికి మెుఱ్ఱపెట్టుకొసుడి.మీకు సహాయపడుటకు ఆయన సిద్దముగా ఉన్నాడు .మీరు శిరస్సు వంచి ఎప్పుడైనా,ఎక్కడైన అతనితో మాట్లాడవచ్చు .
మరలా ఒక రోజు ఆయన రానై యున్నాడు,ఆయన యుందు విశ్వాసముంచిన వారందరిని తనతో పరలోకానికి తీసుకు వెళ్తాడు.