ఈ జీవితానంతరం వేరొక జీవితమున్నదా అనే ఆలోచన లేకుండ ఎవ్వడూ భవిష్యత్తునుగురించి ఊహింపడు. మానవుడు మరణానం తర మేమౌతుందని యోచింపకుండా ఉండడు గాని, ప్రస్తుతపు పనుల ఒత్తిడివల్ల ఆ ఆలోచనలను మనసునుండి తొలగించి మరణం, పర లోకం, నరకం - వీని విచారమును దూరపుకాలానికి నెట్టివేస్తాడు (మత్తయి 24:48, ప్రసంగి 8:11). నిజానికి మానవు డేదోయొక నిర్ణయా నికి రావలెను. ఏదీ లేకుండా వుండడమంటే శాశ్వతంగా నష్టపోవడమే. పరలోకపు ప్రాభవం, లేదా దుష్టకార్యాసక్తులకు ప్రాప్తించు నిరంతర దండనం. బైబిలులో చెప్పినట్లుగా ఈ రెంటిలో మనము పరలోకమునే శాశ్వతముగా ఎంచుకొనవలెను. దీనిని పొందుటకై మనము సరియైన మార్గము నెంచుకొనవలెను. ఎట్టి పాపమూ పరలోకము నంటజాదు; ఇది మాత్రము నిజము. తమ పాపములకు క్షమార్పణము పొందనివారికి నరకములో శాశ్వతమైన శిక్ష పడును. “వీరు నిత్యశిక్షకును, నీతిమం తులు నిత్యజీవితమునకు పోవుదురు” (మత్తయి 25:46, మరియు చూడుడు: మత్తయి 7:21-23).
మీ దేశాన్ని నడిపించే నాయకునితో మీరు ఎలా మాట్లాడాలను కుంటున్నారు?.లేక వేరొక ప్రసిద్ధుడైన వ్యక్తీ తో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు?.లేక అతను మీ గృహములో ఎలా వుండాలని ఆశిస్తారు? మనలో చాలామందికి ఈ అవకాశం రాదు.కానీ ఈ ఇరువురు కంటే చాల ప్రాముఖ్యమైన వ్యక్తితో మీరు మాట్లాడగలరు అని తెలుసా?అంతకంటే ఎక్కువైన విషయం ఏమిటంటే అతను మీ గృహములో ఉంటాడు. బహుశా పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని గూర్చి మాట్లాడుతున్నామని ఇప్పటికే మీకు తెలిసేవుంటుంది.అవును యిది నిజమే మనమందరం ఆయనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు.మన యొక్క కృతజ్ఞతల తోనూ,విన్నపాలతో మరియు నిరాశ,నిస్పృహలతో ఆయన యొద్దకు రావచ్చు.ఇదియే ప్రార్ధన. ఒకవేళ మీరు ప్రార్ధన చేసి ఉండవచ్చు.అయితే అదెలా అనిపించింది?నీలో అనేక ప్రశ్నలు మిగిలిపోయాయా?నికీలాగు అనిపించిఉండుంటే,అపోస్తులులు,కూడా ప్రార్ధించడం ఎలాగో మాకు నేర్పమని యేసు క్రీస్తును అడిగినప్పటి నుండి ఇది సాధారణమైన విషయమే.
భయమంటే ఏమిటి? దైవభీతి భవిష్యత్తును గురించిన భయం ఓటమిని గురించిన భయం కష్టాలను గురించిన భయం మరణభయం భయమనే ప్రచ్ఛన్నశత్రువు అన్ని వర్గాలవారినీ, అన్ని జాతుల వారినీ, అన్ని వయస్సులవారినీ వెన్నాడుతుంటుంది. ఇది లోలోపల మనలను క్రుంగదీస్తుంది; మన ఆలోచనలను భంగపరుస్తుంది; అంత శ్శాంతిని వమ్ముచేస్తుంది; జీవితేచ్ఛను కూలద్రోస్తుంది. ఇది మనకు తడ బాటును, ఆయాసమును, గాబరాను, కలతను, అవ్యవస్థతను, పిరికిత నాన్ని కలిగిస్తుంది.
బైబిలు దేవుని వాక్యము,నిత్యమైన సత్యము. జగత్సృష్టి, దైవము పట్ల మానవుని నిరాదరణ, ఆ పాపముచే మానవుని ఆవేశీంచిన హాని ఇందలో గల అంశములు. అంతేకాక పాపమువిముక్తికై తగు ప్రణాళికను సిద్ధము చేయుటలో దేవునికి మానవునిపై గల ప్రేమనుగుఱించియు ఇది తెల్పును. లోకములో నొక రక్షకు డుద్భవించి, మానవుని పాపముల కొఱకై అతడు మరణించి,. మానవుని ముక్తికొఱకై పునరుత్థానమును చెందుట ఇది ప్రస్తావించున్నది. ఈ సందేశమును నమ్మినవారు పాప ములనుండి క్షమాభిక్షను, మనశ్శాంతిని, సర్వమానవప్రేమను, పాప నిరోధకత్వమును, సదాయుష్యముపై సజీవమైన నమ్మికను కల్గి యుందురు.
మీ గురుంచి పూర్తిగా తెలిసిన (ఎరిగిన) ఒకరు వున్నారు అని మీకు తెలుసా? భూమిని అందులోని సమస్తమును సృష్టించిన దేవుడే ఆ వ్యక్తి. యేసు దేవుని కుమారుడు, కూడా నీవు చేసిన ప్రతిది ఆయనకు తెలుసు. ఆయనకు గతకాలం, ప్రస్తుతము మరియు భవిష్యత్ కూడా తెలుసు. ఆయన మిమ్మును ప్రేమించెను మరియు పాపము నుండి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. మీ జీవితములో సంతోషము పొందుటకు ఆయన దగ్గర మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఒక రోజు యేసు తన స్నేహితులతో ప్రయాణిస్తూ సమరయ అను ఒక గ్రామమునకు వచ్చెను. అతని స్నేహితులు ఆహారము కొనుటకు వెళ్ళినపుడు యేసు బావి ప్రక్కన కూర్చుండెను. యేసు అక్కడ కూర్చునివుండగా ఒక స్త్రీ నీళ్ళ కొరకు ఆ బావి యొద్దకు వచ్చెను. త్రాగుటకు నాకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను యేసు అడిగెను.
మీరు సంతోషకరమైన వ్యక్తిగా ఉన్నారా ? లేక భయము మరియు అపరాధ భావము మీ సంతోషమంతటిని హరించుచున్నాయా? మీ అపరాధ భావాన్ని వదిలించుకోవాలని ఆశిస్తున్నారా అయితే ఎలా ? నేను మరలా తిరిగి సంతోషముగా ఉండగలనా అని అనుకొంటున్నారా? మీ కొరకు నా యెద్ద మంచి వర్తమానము ఉన్నది. మీకు సహాయము చేయుటకు మీ పాపములు క్షమించుటకు మరియు నిత్య ఆనందము ఇచ్చుటకు ఒకరు ఉన్నారు. అయన పేరు యేసు క్రీస్తు ఆయనను గూర్చి మీకు తెలియజేస్తాను.
నాకొక స్నేహితుడు ఉండెను.నాకుండిన స్నేహితులందరిలో ఉత్తమమైన వాడు.అతడు సత్యవంతుడు మరియు చాలా దయ కలిగిన వాడు.కాబట్టి నీవు కూడా అతని గురుంచి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.అతని పేరు యేసు.అధ్బుతమైన విషయం ఏమిటంటే అతడు నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అతనిని గూర్చి నీకు చెబుతాను.మనం ఈ కథ బైబిల్ నందు చదవవచ్చు.బైబిల్ సత్యమైనది.అది దేవుని వాక్యము. ప్రపంచమును మరియు దానిలోని సమస్తమును దేవుడే సృష్టించెను.ఆయన భూలోకమునకు మరియు పరలోకమునకు ప్రభువై యున్నాడు.ఆయన అన్నింటికి ప్రాణమును మరియు ఊపిరిని అనుగ్రహిస్తాడు. యేసు దేవుని కుమారుడు.అతనిని మనందరి స్వంతరక్షకుడుగా ఉండుటకు దేవుడు భూమి మీదకు పంపెను.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను(అంటే నిన్ను మరియు నన్ను ప్రేమించెను )కాగా తన అద్వితీయ కుమారుని (మన కొరకు మరణించుటకు )పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందవలెనని ఆయనను అనుగ్రహించెను.(యోహాను3:16)
“శాంతి - శాంతి యెక్కడుంది - మన రాష్ట్రాలకు, మన యిండ్లకు, ముఖ్యంగా మన మనస్సులకూ?” ఈ ఆర్తనాదం తరతరాలపాటు ప్రతి ధ్వనిస్తూనే వుంది గాని ప్రపంచం మఱింత వ్యాకులితమై, భయగ్రస్తమైన కొద్దీ ఈ స్వరం ప్రగాఢంగా వినిపిస్తూ వుంది. నీ హృదయంగూడ ఇట్లే ఘోషిస్తున్నదా? ఈ అసంతృప్తి, కల్లోలాల వలయంలో నీ హృదయం వీని నధిగమించిన అంతశ్శాంతికొరకు తపిస్తున్నదా? ప్రపంచాన్ని సురక్షితంగాను, మంచిగాను చేయడానికి ఉద్యమిం చిన కార్యాలు జీవితాన్ని మరింత క్లిష్టంగాను, జటిలంగాను చేసినవి. చాలా విషయాలలో తల్లిదండ్రులకంటె తమ జీవితములు మెరుగుగా నున్నను కలవరము నెలకొనియున్నది. ప్రజలు పరిశ్రాంతులు, చింతా పరులై యున్నారు. నిస్సందేహంగా సన్మార్గసూచనకు, భద్రతకు, ఆత్మవిశ్వాసానికి కావలసిన యత్న మావశ్యకమై యున్నది. మనకు మనశ్శాంతి ఆవశ్యకమూ, అవసరమై యున్నది. మనశ్శాంతి - ఎంతటి భాగ్యం? ఇంత నిరాశావైరుధ్యాలమధ్య, చింతావ్యాకులతలమధ్య ఈ భాగ్యాన్ని మనం చూడగలమా?
ఎపుడైనా నీవు నీ చుట్టూ ఉన్న సృష్టిని చూచి అవి ఎలా ప్రారంభమైనవో ఆశ్చర్యపడితివా? సృష్టిలో అనేకమైన జంతువులు, పక్షులు, చెట్లు, మరియు మొక్కలు భూ మి మీద ఉన్నవి. అవి ఎక్కడ నుంచి వచ్చాయి? అవి ఎల్లప్పుడునూ ఇక్కడ ఉన్నవా? మానవుని గురుంచి ఏమిటి? నీ దేహము ఎలా పనిచేస్తుందో చూడుము. నీ కన్నులు చూచుటకు, నీ చెవులు వినుటకు, నీ పాదాలు చేతులు పని చేయుటకు సహాయపడుతన్నవి, మరియు నీవు వెళ్ళవలసిన చోటునకు వెళ్లుచున్నావు. ఇవన్నీ కేవలము జరుగుచున్నవా, లేదా అవి ఒకరిచేత నిర్మించబడినవా?