మీ గురుంచి పూర్తిగా తెలిసిన (ఎరిగిన) ఒకరు వున్నారు అని మీకు తెలుసా? భూమిని అందులోని సమస్తమును సృష్టించిన దేవుడే ఆ వ్యక్తి. యేసు దేవుని కుమారుడు, కూడా నీవు చేసిన ప్రతిది ఆయనకు తెలుసు. ఆయనకు గతకాలం, ప్రస్తుతము మరియు భవిష్యత్ కూడా తెలుసు. ఆయన మిమ్మును ప్రేమించెను మరియు పాపము నుండి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. మీ జీవితములో సంతోషము పొందుటకు ఆయన దగ్గర మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది.
ఒక రోజు యేసు తన స్నేహితులతో ప్రయాణిస్తూ సమరయ అను ఒక గ్రామమునకు వచ్చెను. అతని స్నేహితులు ఆహారము కొనుటకు వెళ్ళినపుడు యేసు బావి ప్రక్కన కూర్చుండెను.
యేసు అక్కడ కూర్చునివుండగా ఒక స్త్రీ నీళ్ళ కొరకు ఆ బావి యొద్దకు వచ్చెను. త్రాగుటకు నాకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను యేసు అడిగెను.
ఆ స్త్రీ ఆశ్చర్యపడి “త్రాగుటకు నీళ్ళు నన్నడుగుచున్నావా?నేను సమరయ స్త్రీ అనియు యూదులైన మీరు మాతో సాంగత్యము చేయరని నీకు తెలియదా?” అని అడిగెను.
“నీవు దేవుని వరమును మరియు నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో నీకు తెలిసియుంటే నీవే జీవజలము యిమ్మని నన్ను అడిగి యుందువు. నేను నీకు సంతోషముగా నీకు యిచ్చి యుండేవాడిని”అని యేసు ఆమెతో చెప్పెను.
ఆమె ఆశ్చర్యముతో ఆయన వైపు చూసి అయ్యా! ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీ యెద్ద ఏమియు లేదే, నాకు జీవ జలము నాకేలా యివ్వగలవు?” అనెను.
యేసు ఆమెతో మరలా చెప్పెను, “ఈ బావి లోని నీటిని త్రాగినవారు మరలా దప్పిగొనును, కానీ నేనిచ్చు నీటిని త్రాగితే నీవు ఎన్నటికీ దప్పిగొనవు”
అప్పుడా స్త్రీ “అయ్యా! నేను ఎన్నడు దప్పిగోనకుండా యుండి ఈ బావి దగ్గరకు మరలా రాకుండా నాకు ఆ జీవజలము యిమ్మని” చెప్పెను.
యేసు “నీవు వెళ్లి నీ భర్తకు తెలియజేసి మరలా తిరిగి రమ్మని” చెప్పెను.
“నాకు భర్త లేడని“ ఆమె చెప్పెను.
యేసు “నీవు నిజమే చెప్పితివి. నీకు ఐదు మంది భర్తలుండిరి. నీవు యిపుడున్నవాడు కూడా నీ భర్త కాదు” అని చెప్పెను.
నా గురుంచి యితనికెలా తెలిసేనని ఆమె ఆశ్చర్యపడెను. అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తెలుసు. నిన్ను అడుగుటకు నా కోక ప్రశ్న ఉంది. ”మా ప్రజలు ఈ స్థలములో దేవునిని ఆరాధించిరి. నీవు యెరుషలేములో ఆరాధించవలెనని చెప్పుచున్నావు” అనెను.
యేసు “మనం ఎక్కడ ఆరాధించవలెననునది ముఖ్యంకాదు. యిపుడు నిజ విశ్వాసులు తండ్రిని ఎక్కడైనా ఆత్మ తోనూ, సత్యము తోనూ ఆరాధించవచ్చు”నని ఆమె తో చెప్పెను. క్రీస్తనబడే మెస్సియా వచ్చినపుడు అన్ని విషయములు మనకు భోదిన్చునని ఆమె చెప్పెను.
“నేనే ఆయనను“ అని యేసు ఆమెతో అనెను.
ఆమె తన నీటి కుండను అక్కడ విడిచి పెట్టి ఊరిలోనికి తిరిగి వెళ్ళెను. రండి “నేను నా జీవితములో చేసినదంతా చెప్పిన ఒక మనుష్యుడు అక్కడున్నాడు చూడండి. అతను క్రీస్తు కాడా?”అని చెప్పెను.
తర్వాత ఆ ఊరివారందరూ యేసును కలుసుకొనుటకు బయలు వెళ్ళెను. అనేక మంది ఆయన క్రీస్తనియు , రక్షకుడనియు నమ్మిరి. ఎందుకంటే ఆయన వారిని గూర్చి సమస్తము ను ఎరిగియున్నాడు గనుక ఈ వృత్తాంతమును బైబిల్ నందు యోహాను సువార్త 4:3-42 లో చదవగలరు.
యేసు మనందరి గూర్చి సమస్తము మంచి మరియు చెడుతనమంతా ఎరిగియున్నాడు. మనం చేసిన చెడు క్రియలను దాచాలని కోరుకుంటాం కానీ క్రీస్తు నుండి మాత్రం దాచలేము. మనం చేసిన అపరాధముల వలన మనకు వచ్చు న్యాయమైనశిక్షనుండి రక్షించుటకు ఆయన వచ్చెను. మన హృదయములో కలుగు భారమంతటిని తీసివేసి మనకు శాంతిని ఇస్తాడు. మన పాపములను తీసివేసి, మనం మరణించినపుడు పరలోకములో నివాసములు పొందుటకు ఆయన మరణించెను.
మీకు వున్న ప్రతి అవసరతకు మరియు ప్రశ్నలకు యేసే సమాధానము. ఆయన మీకు స్నేహితుడుగా ఉండాలని ఆశిస్తున్నాడు. మీ హృదయములో ఉన్న ఖాళీనంతటిని ఆయన నింపాలని కోరుకుంటున్నాడు. మీ భయమును మరియు బడలికను తీసివేసి శాంతిని, నెమ్మదిని అనిగ్రహించగలడు.
యేసు చెప్పెను “నా యొద్దకు రండి… మీకు విశ్రాంతిని కలుగజేతును” (మత్తయి:11-28).
నీవు దేవునికి ప్రార్ధన చేసి, నీవు చేసిన పాపములకు క్షమాపణ కోరు, యేసు క్రీస్తును మీ జీవితములోనికి రమ్మని ఆహ్వానించు, మిమ్మును మీరు ఈ గొప్ప దేవునికి సమర్పించుకుంటే ఆయన మీ హృదయములో నివసిస్తాడు. ఆయన సన్నిధి మీకు ఆనందమును అనుగ్రహించును. ఆయన మీకు శక్తిని మరియు మీ జీవితానికి ఉద్దేశమును ఇస్తాడు. ఆయనే మీకు జవాబుగా వుంటాడు.