మీ గురుంచి పూర్తిగా తెలిసిన (ఎరిగిన) ఒకరు వున్నారు అని మీకు తెలుసా? భూమిని అందులోని సమస్తమును సృష్టించిన దేవుడే ఆ వ్యక్తి. యేసు దేవుని కుమారుడు, కూడా నీవు చేసిన ప్రతిది ఆయనకు తెలుసు. ఆయనకు గతకాలం, ప్రస్తుతము మరియు భవిష్యత్ కూడా తెలుసు. ఆయన మిమ్మును ప్రేమించెను మరియు పాపము నుండి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. మీ జీవితములో సంతోషము పొందుటకు ఆయన దగ్గర మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఒక రోజు యేసు తన స్నేహితులతో ప్రయాణిస్తూ సమరయ అను ఒక గ్రామమునకు వచ్చెను. అతని స్నేహితులు ఆహారము కొనుటకు వెళ్ళినపుడు యేసు బావి ప్రక్కన కూర్చుండెను. యేసు అక్కడ కూర్చునివుండగా ఒక స్త్రీ నీళ్ళ కొరకు ఆ బావి యొద్దకు వచ్చెను. త్రాగుటకు నాకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను యేసు అడిగెను.