ఎపుడైనా నీవు నీ చుట్టూ ఉన్న సృష్టిని చూచి అవి ఎలా ప్రారంభమైనవో ఆశ్చర్యపడితివా? సృష్టిలో అనేకమైన జంతువులు, పక్షులు, చెట్లు, మరియు మొక్కలు భూ మి మీద ఉన్నవి. అవి ఎక్కడ నుంచి వచ్చాయి? అవి ఎల్లప్పుడునూ ఇక్కడ ఉన్నవా? మానవుని గురుంచి ఏమిటి? నీ దేహము ఎలా పనిచేస్తుందో చూడుము. నీ కన్నులు చూచుటకు, నీ చెవులు వినుటకు, నీ పాదాలు చేతులు పని చేయుటకు సహాయపడుతన్నవి, మరియు నీవు వెళ్ళవలసిన చోటునకు వెళ్లుచున్నావు. ఇవన్నీ కేవలము జరుగుచున్నవా, లేదా అవి ఒకరిచేత నిర్మించబడినవా?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము దేవుని వాక్యమనబడిన పరిశుద్ధ గ్రంథములో చూడగలము. ప్రపంచ నిర్మాణం గురుంచి పరిశుద్ధ గ్రంథము మనకు చెబుతుంది. "ఆదియం దు దేవుడు భూ మ్యాకాశములను సృజించెను" (ఆదికాండము 1:1) అని పరిశుద్ధ గ్రంథములోని మొదటి వచనము చెబుతుంది. భూ మిని సృష్టింపక మునుపే, దేవుడు ఉన్నాడు. దేవుడు నిరంతరము ఉన్నవాడు; ఆయనకు ఆరంభము అం తము లేనివాడు.
దీని పూర్తి వచనము :-
ఆదికాండము యొక్క మొదటి అధ్యాయము నందు దేవుడు ప్రపంచమును అం దులోని సమస్తమును ఆరు రోజులలో సృష్టించెననియు మనకు తెలుపుతున్నది.
మొదటి రోజున దేవుడు; "వెలుగు కమ్మని పలుకగా" వెలుగు కలిగెను. ఆయన వెలుగును చీకటిని వేరుపరిచి పగలు రాత్రి అని వాటిని పిలిచెను.
రెండవ రోజున ఆకాశమును సృష్టించెను.
మూడవ రోజున ఆయన నేలను జలములను వేరుపరిచి వాటికి భూ మి, సముద్రము అని పేర్లు పెట్టెను. ఆయన గడ్డిని, మొక్కలను, వృ క్షములను మరియు అవి తమ తమ ప్రకారము విత్తనములిచ్చు మొక్కలను చెట్లను మొలిపించెను.
నాలుగవ రోజున దేవుడు రెండు గొప్ప జ్యోతులను సృజించెను. అనగా పగటిని ఏలుటకు సూర్యుడును, రాత్రిని ఏలుటకు చంద్రుడును చేసెను. వాటివలన మనకు రోజులు, నెలలు, సంవత్స రములు కలిగెను. సమస్త నక్షత్రములను కూడా ఆయనే సృష్టించెను.
ఐదవ దినమున దేవుడు పక్షులను చేపలను సృష్టించెను.
ఆరవ దినమున, నేల మీద ప్రాకు, నడుచు జంతువులను సృష్టించెను. మరియు అవి పునరుత్పత్తి చేయువిధముగా చేసి అవి తిరిగి మరల జీవించుటకు వాటిని చేసెను. అవి ముసలితనమై చనిపోయినప్పుడు వాటికి బదులుగా మరి ఎక్కువగా జన్మించు విధముగా వాటిని సృష్టించెను.
అదే ఆరవ రోజున దేవుడు తన స్వరూపమందు మానవుని సృజించెను, నేలమట్టి నుండి వానిని సృజించెను. నరునికి సహాయము అవసరమని దేవుడు ఎరిగెను. కాబట్టి దేవుడు నరుని ప్రక్కటెముకను తీసుకుని స్త్రీనిగా నిర్మించెను. మీరు ఫలించి అభివృ ద్ధి పొంది విస్తరించి భూ మిని నింపి ఆయన సృష్టించిన వాటన్నిటిని లోపరుచుకొనుడని వారితో చెప్పెను.
దేవుడు తాను సృష్టించిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగానుండెను.
దేవుడు మానవునికి భూ మిని గృహముగాను మరియు ఆయనను ఆరాధించుటకు ఘనపరుచుటకుగాను నియమించెను.
ఇదియుగాక తాను సృష్టించిన సృష్టిని ఏలుటకు జాగ్రత్తగా చూచుకొనుటకు మానవునిని నిర్మించెను.
ప్రపంచము మరియు మానవుని చరిత్ర అం తయు పరిశుద్ధ గ్రంథమందున్నది. అయినను ఇదం తయు ఏ విధముగా ప్రారంభమాయెనో అనుటకు ఇది ఒక చరిత్ర. మనము అర్ధంచేసుకొనిన దానికన్నా దేవుడు ఎక్కువగా మానవునిని ప్రేమించెను. మరియు మనలను ఆశ్చర్యపరిచే అనేక కార్యములను ఆయన చేసెను. ఒక నూతన శిశువును పట్టుకొనుట, అం దమైన పువ్వును చూచుట లేక సూర్యాస్తమయమును చూచుట మనలను దేవునిని గూర్చి ఆలోచింపచేయును, ఆయనే సమస్తమునకు తం డ్రి. నీ జీవితముతో ఆయనను గౌరవించుటకు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయనకు ప్రతిదాని యం దు శక్తి కలదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, స్నేహితునిగాను, రక్షకునిగాను ఉం డాలని కోరుకుంటున్నాడు.__