కరపత్రాలు
పరలోకం నీ భవిష్యనిలయం
నీ భవిష్యత్తు మాటేమిటి? ఈ జీవితానంతరం వేరొక జీవితమున్నదా అనే ఆలోచన లేకుండ ఎవ్వడూ భవిష్యత్తునుగురించి ఊహింపడు. మానవుడు మరణానం తర మేమౌతుందని యోచింపకుండా ఉండడు గాని, ప్రస్తుతపు పనుల ఒత్తిడివల్ల ఆ ఆలోచనలను మనసునుండి తొలగించి మరణం, పర లోకం, నరకం - వీని విచారమును దూరపుకాలానికి నెట్టివేస్తాడు (మత్తయి 24:48, ప్రసంగి 8:11). నిజానికి మానవు డేదోయొక నిర్ణయా నికి రావలెను. ఏదీ లేకుండా వుండడమంటే శాశ్వతంగా నష్టపోవడమే. మనిషికి రెండే రెండు గతులున్నవి పాపవిముక్తులందరికి పరలోకము నిలయము పరలోకం తేజోమయం ఇహలోకమందలి జీవితము నీడల మయము. ఇందులో మనకర్థము కాని విషయము లెన్నో యుండును. భవిష్యత్తులోనికి చూడాలనుకుం టాము గాని చూడలేము. మానవునికి తెలిసిన దెంతయున్నను తెలియ నిది చాలా యున్నది. జీవితంలో తరచుగా నిరాశానిస్పృహలు పొందు తుంటాము. ఇవన్నీ జీవితంలో మన మెదుర్కొనే చీకటి సన్నివేశాలు. పరలోకము భయరహితము, పాపరహితము రక్షితుని అమృతత్వము
మీ దేశాన్ని నడిపించే నాయకునితో మీరు ఎలా మాట్లాడాలను కుంటున్నారు?.లేక వేరొక ప్రసిద్ధుడైన వ్యక్తీ తో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు?.లేక అతను మీ గృహములో ఎలా వుండాలని ఆశిస్తారు? మనలో చాలామందికి ఈ అవకాశం రాదు.కానీ ఈ ఇరువురు కంటే చాల ప్రాముఖ్యమైన వ్యక్తితో మీరు మాట్లాడగలరు అని తెలుసా?అంతకంటే ఎక్కువైన విషయం ఏమిటంటే అతను మీ గృహములో ఉంటాడు. బహుశా పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుని గూర్చి మాట్లాడుతున్నామని ఇప్పటికే మీకు తెలిసేవుంటుంది.అవును యిది నిజమే మనమందరం ఆయనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు.మన యొక్క కృతజ్ఞతల తోనూ,విన్నపాలతో మరియు నిరాశ,నిస్పృహలతో ఆయన యొద్దకు రావచ్చు.ఇదియే ప్రార్ధన. ఒకవేళ మీరు ప్రార్ధన చేసి ఉండవచ్చు.అయితే అదెలా అనిపించింది?నీలో అనేక ప్రశ్నలు మిగిలిపోయాయా?నికీలాగు అనిపించిఉండుంటే,అపోస్తులులు,కూడా ప్రార్ధించడం ఎలాగో మాకు నేర్పమని యేసు క్రీస్తును అడిగినప్పటి నుండి ఇది సాధారణమైన విషయమే.
భయంనుండి విముక్తి
భయమంటే ఏమిటి? దైవభీతి భవిష్యత్తును గురించిన భయం ఓటమిని గురించిన భయం కష్టాలను గురించిన భయం మరణభయం భయమంటే ఏమిటి? భయమనే ప్రచ్ఛన్నశత్రువు అన్ని వర్గాలవారినీ, అన్ని జాతుల వారినీ, అన్ని వయస్సులవారినీ వెన్నాడుతుంటుంది. ఇది లోలోపల మనలను క్రుంగదీస్తుంది; మన ఆలోచనలను భంగపరుస్తుంది; అంత శ్శాంతిని వమ్ముచేస్తుంది; జీవితేచ్ఛను కూలద్రోస్తుంది. ఇది మనకు తడ బాటును, ఆయాసమును, గాబరాను, కలతను, అవ్యవస్థతను, పిరికిత నాన్ని కలిగిస్తుంది. భయం ఎంత మెల్లగా, నిశ్శబ్దంగా మనలో ప్రవేశిస్తుందంటే దాని వినాశకరమైన ప్రభావానికి బలియౌతున్నామని మనం గ్రహించలేము. గ్లాసులోని నీటిలో వేసిన చిన్న రంగుచుక్కలాగా కొద్దిపాటి భయమైనా ప్రతిదాన్నీ కలుషితం చేస్తుంది. ఈ చిన్నపాటి భయప్రవాహాన్ని అరి కట్టకపోతే మిగతా ఆలోచనలు దానిలోచేరి అది పెద్ద ప్రవాహమౌతుంది. దైవభీతి భవిష్యత్తును గుఱింనిన భయం ఓటమిని గుఱించిన భయం కష్టముల గుఱించిన భయం మరణభయం రమ్ము - నమ్మికతో, ప్రార్థనతో, ప్రత్యాశతో, నీవు మనశ్శాంతిని పొందుదువు.
సర్వజగత్తునకు వెలుగు బైబిలు దేవుని వాక్యము,నిత్యమైన సత్యము. జగత్సృష్టి, దైవము పట్ల మానవుని నిరాదరణ, ఆ పాపముచే మానవుని ఆవేశీంచిన హాని ఇందలో గల అంశములు. అంతేకాక పాపమువిముక్తికై తగు ప్రణాళికను సిద్ధము చేయుటలో దేవునికి మానవునిపై గల ప్రేమనుగుఱించియు ఇది తెల్పును. లోకములో నొక రక్షకు డుద్భవించి, మానవుని పాపముల కొఱకై అతడు మరణించి,. మానవుని ముక్తికొఱకై పునరుత్థానమును చెందుట ఇది ప్రస్తావించున్నది. ఈ సందేశమును నమ్మినవారు పాప ములనుండి క్షమాభిక్షను, మనశ్శాంతిని, సర్వమానవప్రేమను, పాప నిరోధకత్వమును, సదాయుష్యముపై సజీవమైన నమ్మికను కల్గి యుందురు. దేవుని అద్భుతమైన సృష్టి ఆదామునకు సహాయము కావలెనని దేవుడు గ్రహించెను.అందుచే ఆదామును దేవుడు గాఢనిద్రలో నుంచి, ఆదాము ప్రక్కయెముకను తీసికొని, స్త్రీని (హవ్వను) సృజించెను. ఆదాము హవ్వను ప్రేమించు చుండెను; హవ్వకూడ ఆదామును ప్రేమించెను. వారు మధురమైన అన్యోన్యసాహచర్యమును కలిగియుండిరి. ఇదియే కుటుంబమునకు దేవుని యేర్పాటుగా నుండెను. దుఃఖకరమైన పాపముయొక్క ఆవిర్భావము
మీ కొరకు ఒక జవాబు
ఒక రోజు యేసు తన స్నేహితులతో ప్రయాణిస్తూ సమరయ అను ఒక గ్రామమునకు వచ్చెను. అతని స్నేహితులు ఆహారము కొనుటకు వెళ్ళినపుడు యేసు బావి ప్రక్కన కూర్చుండెను. యేసు అక్కడ కూర్చునివుండగా ఒక స్త్రీ నీళ్ళ కొరకు ఆ బావి యొద్దకు వచ్చెను. త్రాగుటకు నాకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను యేసు అడిగెను. ఆ స్త్రీ ఆశ్చర్యపడి “త్రాగుటకు నీళ్ళు నన్నడుగుచున్నావా?నేను సమరయ స్త్రీ అనియు యూదులైన మీరు మాతో సాంగత్యము చేయరని నీకు తెలియదా?” అని అడిగెను. “నీవు దేవుని వరమును మరియు నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో నీకు తెలిసియుంటే నీవే జీవజలము యిమ్మని నన్ను అడిగి యుందువు. నేను నీకు సంతోషముగా నీకు యిచ్చి యుండేవాడిని”అని యేసు ఆమెతో చెప్పెను. అప్పుడా స్త్రీ “అయ్యా! నేను ఎన్నడు దప్పిగోనకుండా యుండి ఈ బావి దగ్గరకు మరలా రాకుండా నాకు ఆ జీవజలము యిమ్మని” చెప్పెను.
మీ కొరకు ఒక రక్షకుడు
మీ కొరకు నా యెద్ద మంచి వర్తమానము ఉన్నది. మీకు సహాయము చేయుటకు మీ పాపములు క్షమించుటకు మరియు నిత్య ఆనందము ఇచ్చుటకు ఒకరు ఉన్నారు. అయన పేరు యేసు క్రీస్తు ఆయనను గూర్చి మీకు తెలియజేస్తాను. లోకమును దానిలోని సమస్తమును దేవుడు ఏర్పరచాడు. నిన్ను మరియు నన్ను అయన ఏర్పరచేను. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు. లోకములోని ప్రతి ఒక్కరిని అయన ప్రేమించుచున్నాడు. లోకములోని ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమించాడంటే తన అద్వితీయ (ఏకైక) కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకమునకు పంపించాడు. యేసు క్రీస్తు ఈ భూమి మీద నివసించినప్పుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను దుఃఖంచుచున్న వారిని ఓదార్చెను. గ్రుడ్డి వాని కన్నులను తెరచెను. అయన అనేక విషయాలను ప్రజలకు భోదించెను. వీటిని గూర్చి బైబులు నందు మనము చదువవచ్చు.
మీకొరకు – ఒక స్నేహితుడు
మీ స్నేహితుడైన యేసు అతనిని గూర్చి నీకు చెబుతాను.మనం ఈ కథ బైబిల్ నందు చదవవచ్చు.బైబిల్ సత్యమైనది.అది దేవుని వాక్యము. ప్రపంచమును మరియు దానిలోని సమస్తమును దేవుడే సృష్టించెను.ఆయన భూలోకమునకు మరియు పరలోకమునకు ప్రభువై యున్నాడు.ఆయన అన్నింటికి ప్రాణమును మరియు ఊపిరిని అనుగ్రహిస్తాడు. యేసు పసి బాలుడుగా భూమిమీదకు వచ్చెను.భూమి మీద యోసేపు,మరియలు తల్లితండ్రులుగా యుండెను.ఆయన పశువుల పాకలో జన్మించి తొట్టెలో పరుండబెట్టబడెను. పిల్లలు కూడా యేసుని ప్రేమించి అతనితో ఉండుటకు యిష్టపడుచుండిరి. కొందరు యేసును ప్రేమించక ద్వేషించి హింసించిరి.వారు యేసుని బహుగా ద్వేషించి చివరికి చంపవలెనని నిశ్చయించుకొనిరి.ఒకానొక దినమున ఆయనను సిలువలో మేకులు గొట్టి చంపిరి.యేసు ఏ నేరము చేయలేదు.నీవు నేను చేసిన అపరాధములకు మన స్థానములో ఆయన మరణించ వలసి వచ్చెను. మరలా ఒక రోజు ఆయన రానై యున్నాడు,ఆయన యుందు విశ్వాసముంచిన వారందరిని తనతో పరలోకానికి తీసుకు వెళ్తాడు.
ప్రపంచాన్ని సురక్షితంగాను, మంచిగాను చేయడానికి ఉద్యమిం చిన కార్యాలు జీవితాన్ని మరింత క్లిష్టంగాను, జటిలంగాను చేసినవి. చాలా విషయాలలో తల్లిదండ్రులకంటె తమ జీవితములు మెరుగుగా నున్నను కలవరము నెలకొనియున్నది. ప్రజలు పరిశ్రాంతులు, చింతా పరులై యున్నారు. నిస్సందేహంగా సన్మార్గసూచనకు, భద్రతకు, ఆత్మవిశ్వాసానికి కావలసిన యత్న మావశ్యకమై యున్నది. మనకు మనశ్శాంతి ఆవశ్యకమూ, అవసరమై యున్నది. మనశ్శాంతి - ఎంతటి భాగ్యం? ఇంత నిరాశావైరుధ్యాలమధ్య, చింతావ్యాకులతలమధ్య ఈ భాగ్యాన్ని మనం చూడగలమా? చాలామంది అనుభవింపదగిన బాహిరవస్తువులనే చూస్తారు గాని అంతర్దర్శనమును చేసికొనరు. అట్లు చూచుకుంటే ఏం కనపడుతుందో అని వారి భయం. వారి కలతనొందిన మనస్సులకు కలతనొందిన ప్రపం చాన్ని నిందిస్తారు గాని దానికి విరుగుడు అంతర్దర్శనం చేసికొనడమే. మానవుడు సంక్షోభంలో ఉన్నాడు దైవము కేంద్రంగా గల జీవితమే శాంతి నిస్తుంది యేసు క్రీస్తే శాంతికారకుడు మన హృదయాలయందలి సంఘర్షణ పాపముల నంగీకరించుట, పశ్చాత్తాపపడుటవల్ల మనశ్శాంతి కల్గును 23వ కీర్తన స్థిరమైన శాంతి
సృష్టి యొక్క కథ
దీని పూర్తి వచనము :- ఆదికాండము యొక్క మొదటి అధ్యాయము నందు దేవుడు ప్రపంచమును అం దులోని సమస్తమును ఆరు రోజులలో సృష్టించెననియు మనకు తెలుపుతున్నది. మొదటి రోజున దేవుడు; “వెలుగు కమ్మని పలుకగా” వెలుగు కలిగెను. ఆయన వెలుగును చీకటిని వేరుపరిచి పగలు రాత్రి అని వాటిని పిలిచెను. రెండవ రోజున ఆకాశమును సృష్టించెను. ఐదవ దినమున దేవుడు పక్షులను చేపలను సృష్టించెను. ఆరవ దినమున, నేల మీద ప్రాకు, నడుచు జంతువులను సృష్టించెను. మరియు అవి పునరుత్పత్తి చేయువిధముగా చేసి అవి తిరిగి మరల జీవించుటకు వాటిని చేసెను. అవి ముసలితనమై చనిపోయినప్పుడు వాటికి బదులుగా మరి ఎక్కువగా జన్మించు విధముగా వాటిని సృష్టించెను. దేవుడు తాను సృష్టించిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగానుండెను. దేవుడు మానవునికి భూ మిని గృహముగాను మరియు ఆయనను ఆరాధించుటకు ఘనపరుచుటకుగాను నియమించెను.